చెన్నై ఐఐటీ బాత్రూమ్ కుళాయిలో సెల్‌ఫోన్.. 3 నెలలుగా వీడియోలు

గురువారం, 20 ఫిబ్రవరి 2020 (18:21 IST)
చెన్నై ఐఐటీ కళాశాలలో ఏరో స్పేస్ ఇంజనీరింగ్ శాఖకు చెందిన పరిశోధన కేంద్రంలోని మహిళలు ఉపయోగించే బాత్రూమ్‌లో సెల్‌ఫోనును కనుగొన్నారు. బాత్రూమ్‌లోని నీటి కుళాయిలో వుంచిన సెల్‌ఫోనును ఓ విద్యార్థిని కనుగొంది. 
 
ఈ మేరకు పురుషుల బాత్రూమ్‌లో దాగివున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒకడే తన సెల్ ఫోనును మహిళల బాత్రూమ్‌లో దాచిపెట్టినట్లు తేలింది. ఆపై అతనిపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారు. 
 
ఆపై తాత్కాలిక బెయిల్‌పై విడుదలైన అతని వద్ద విచారణ జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. మహిళల బాత్రూమ్‌లో దాచివుంచిన సెల్ ఫోన్ ద్వారా మూడు నెలల పాటు అరెస్టయిన అసిస్టెంట్ ప్రొఫెసర్ వీడియోలు తీసినట్లు తెలిసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు