ఇంటర్ విద్యార్థులకు 'ఉపకారం' లేనట్టేనా? సీఎం జగన్ మాయ?!

మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (12:32 IST)
ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చదువుతున్న ఇంటర్ విద్యార్థులకు అన్యాయం చేయనున్నారా? అందుకే గత ఎనిమిది నెలలుగా వారికి చెల్లించాల్సిన ఉపకారవేతనాలను చెల్లించకుండా ఉన్నారా? అంటే ఔననే అంటున్నారు ఇంటర్ విద్యార్థులు. 
 
ముఖ్యమంత్రి జగన్ సీఎం పగ్గాలు చేపట్టిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా తల్లులకు అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద ఇంట్లో ఒక్క విద్యార్థికి మాత్రం రూ.15 వేలు అందించారు. ఇదే అదనుగా చూపి.. ఇంట్లో ఎంతమంది చదివితే అందరికీ ఇవ్వాల్సిన ఉపకారవేతనాలకు మంగళం పాట పాడనున్నారనే ప్రచారం సాగుతోంది. 
 
సాధారణంగా ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఇంటర్‌ చదువుతుంటే స్కాలర్‌షిప్‌ రూపంలో ఒక్కొక్కరికి రూ.9 వేల నుంచి రూ.10 వేల వరకు వచ్చేవి. 'అమ్మ ఒడి' పథకంలో భాగంగా ఇంటికి ఒక్క విద్యార్థికి మాత్రం రూ.15 వేలు అందించారు. కానీ, స్కాలర్‌షిప్‌ ఊసెత్తడంలేదు. ఇది ఈబీసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల అవకాశాలను దెబ్బతీస్తోందని అంటున్నారు. 
 
ఇప్పటివరకు విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల గురించి కాలేజీలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ, అమ్మఒడిని ప్రవేశపెట్టి, ఇంటర్‌ స్థాయిలో స్కాలర్‌షిప్‌ను నిలిపివేస్తారని వార్తలు రావడంతో విద్యార్థులపై ఒత్తిడిని పెంచేశాయి. అలాగే, విద్యార్థులు కూడా ఆందోళన చెందుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు