పంజాబ్ రాష్ట్రంలోని ఫరీదాకోట్ ఏరియాకు చెందిన 60 ఏళ్ల చోటా సింగ్ అనే వ్యక్తికి ముగ్గురు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. పెద్ద కొడుకు రాజ్వీందర్ సింగ్‌కు 12 ఏళ్ల క్రితం పెళ్లైంది. రాజ్వీందర్ సింగ్ భార్య జస్వీర్ కౌర్‌తో పాటు ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు.
రాత్రి పడుకున్న తర్వాత రాజ్వీందర్ సింగ్‌పై కత్తితో దాడి చేసిన చోటా సింగ్ శవాన్ని ముక్కలు చేసి బ్యాగులో పెట్టి డ్రైనేజీలో పడేశాడు. చోటా సింగ్, జస్వీర్ కలిసి బాడీని తీసుకుని డ్రైనేజీలో పడేయడానికి వెళ్లిన సమయంలో వారి ఇంటికి మేనల్లుడు వచ్చాడు
గదిలో ఉన్న రక్తం చూసి, కంగారుపడి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చోటాసింగ్‌ను తమదైన శైలిలో నిలదీయగా విషయం బయటికి వచ్చింది. మామకోడళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.