వివరాల్లోకి వెళితే.. కేరళ వడకర సమీపంలోని విల్లిపల్లిలో నివసిస్తున్న దంపతులకు రెండేళ్ల క్రితం వివాహమైంది. వారికి రెండేళ్లైనా సంతానం కలగకపోవడంతో ఆ భర్త నపుంసకుడని వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో తన బాధను స్నేహితుడికి చెప్పిన ఆ వ్యక్తి ... స్నేహితుడి సలహాతో భార్యపై రేప్‌కు సహకరించాడు. వేరొకరితో శారీరక సంబంధం ద్వారా సంతానం కలుగుతుందని స్నేహితుడు ఇచ్చిన సలహాతో పాటు తానే ఆ పనిచేసేందుకు రెడీ అనగానే... ఆ భర్త ప్లాన్ ప్రకారం భార్యను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ చేశాడు.
దీంతోపాటు భర్త ఎదుటే ఆ స్నేహితుడు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. తప్పించుకునేందుకు ఆమె ప్రయత్నించగా.. భర్తే అడ్డుకుని రేప్‌కు సహకరించాడు. ఈ వ్యవహారాన్ని బాధితురాలి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. దీంతో నడక్కవు పోలీసులు రంగంలోకి దిగి భర్తతో పాటు స్నేహితుడిని అదుపులోకి తీసుకుని కోర్టు ముందు హాజరుపరిచారు.