ఓటరు గుర్తింపు కార్డుతో అనుసంధానం చేయాల్సిందే : ఈసీ

ఆదివారం, 11 మార్చి 2018 (14:56 IST)
భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటరు గుర్తింపు కార్డులో ఆధార్ కార్డు అనుసంధానంపై ఈసీ తన మనసు మార్చుకుంది. కేంద్ర ఎన్నికల సంఘం వర్గాల సమాచారం మేరకు ఓటర్లు స్వచ్ఛందంగా, ఇష్టపడితే తమ ఓటర్ ఐడీని ఆధార్ సంఖ్యతో అనుసంధానం చేసుకోవచ్చునని గతంలో సుప్రీంకోర్టుకు చెప్పింది. తాజాగా దీనికి ఎన్నికల సంఘం సవరణ పిటిషన్‌ను సమర్పించింది. 
 
ఓటర్ ఐడీ కార్డుకు ఆధార్ సంఖ్యను తప్పనిసరిగా అనుసంధానం చేసేలా ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరింది. ఓటర్ ఐడీకి ఆధార్‌ సంఖ్యను అనుసంధానం చేయడం వల్ల ఓటర్ల మోసాలను నిరోధించవచ్చునని పేర్కొంది. అంతేకాకుండా ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండేవిధంగా జాగ్రత్తలు తీసుకోవచ్చని తెలిపింది.
 
ఇప్పటివరకు 32 కోట్ల ఓటర్ ఐడీ కార్డులకు ఆధార్ సంఖ్యలను అనుసంధానం చేసినట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓ.పి. రావత్ తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలు వస్తే మిగిలిన 54.5 కోట్ల ఓటర్ కార్డులను ఆధార్ సంఖ్యలతో అనుసంధానం చేస్తామన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు