పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ వార్నింగ్.. దేశంలోకి వచ్చి మరీ దాడిచేస్తాం

మంగళవారం, 23 జనవరి 2018 (10:16 IST)
పాకిస్థాన్‌కు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. దేశంలోకి వచ్చి మరీ దాడి చేస్తామంటూ హెచ్చరించారు. అందువల్ల తమతో పెట్టుకోవద్దని హెచ్చరించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి భారత్ సైన్యంపై కాల్పులకు తెగబడుతున్న విషయం తెల్సిందే. 
 
యూపీ పర్యటనలో భాగంగా రాజ్‌నాథ్ ఓ సభలో మాట్లాడారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత్ తలొగ్గబోదని ఆయన స్పష్టం చేశారు. భారత్ ఏమాత్రం బలహీన దేశం కాదని, శత్రువులపై మా భూభాగం నుంచే కాదు, అవసరమైతే వారి దేశంలోకి చొచ్చుకెళ్లి మరీ దాడిచేస్తామని వార్నింగ్ ఇచ్చారు. 
 
పూంచ్ సెక్టార్‌లో ఐదుగురు ఆర్మీ కమాండోలు వాస్తవాధీన రేఖను దాటివెళ్లి పాక్ సైనికులకు హతమార్చిన నెల రోజుల తర్వాత రాజ్‌నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ దాడితో కేరీ సెక్టార్‌లో నలుగురు భారత జవాన్లను పొట్టనబెట్టుకున్న పాక్ సైన్యంపై ఆర్మీ బదులు తీర్చుకుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు