దేశంలో కరోనా వైరస్ మహమ్మారి ధాటికి ఏకంగా 40 లక్షల మంది చనిపోయినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. దీన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. కరోనా మరణాలను లెక్కించే విధానాన్ని తప్పుబట్టింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటన విడుదల చేసింది.
తక్కువ జనాభా ఉన్న దేశాలకు అనుసరించిన విధానాన్నే.. భౌగోళికంగా, జనాభా పరంగా పెద్ద దేశమైన భారత్ విషయంలోనూ పాటించడం సరికాదని వ్యాఖ్యానించింది. "అంతర్జాతీయంగా కరోనా మరణాలను బహిర్గతం చేసే విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రయత్నాలను భారత్ అడ్డుకుంటోంది" అంటూ న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది.
అయితే, ప్రపచం ఆరోగ్య సంస్థ ప్రకటించిన మరణాల సంఖ్యపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు. కానీ, మరణాల లెక్కింపునకు అనుసరించిన విధానాన్ని మాత్రం భారత్ తప్పుబడుతుంది.
చైనా, బంగ్లాదేశ్, ఇరాన్ సిరియా సైతం మరణాల లెక్కింపునకు అనుసరించిన విధానాన్ని ప్రశ్నించాయి. ఏవో కొద్ది శాంపిల్ సైజు వివరాలతో మరణాలను అంచనా కట్డడం ట్యునీషియా వంటి చిన్న దేశాలకు చెల్లుతుందేమో కానీ, 130 కోట్ల మంది ఉన్న భారత్ వంటి పెద్ద దేశాలకు కాదు. భారత్ నమూనా ఖచ్చితత్వంతో కూడుకున్నది అని పేర్కొంది.