దేశంలో తొలి మంకీపాక్స్ కేసు నమోదు.. వ్యాధి లక్షణాలు?

శుక్రవారం, 15 జులై 2022 (12:04 IST)
Monkeypox
దేశంలో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. ఈ కేసు కేరళలో వెలుగు చూసింది. 3 రోజుల క్రితం యూఏఈ నుంచి వచ్చిన ప్రయాణికుడిలో లక్షణాలను గుర్తించి పూణేలోని వైరాలజీ ఇనిస్టిట్యూట్‌కు పంపారు.

ఈ పరీక్షల్లో అతనికి పాజిటివ్‌గా తేలిందని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి తెలిపారు. యూఏఈలో వున్నప్పుడు ఆ వ్యక్తి ఓ మంకీపాక్స్ రోగితో సన్నిహితంగా మెలిగినట్లు గుర్తించారు.
 
బాధితుడి తల్లిదండ్రులు సహా మొత్తం 13 మందిని ప్రైమరీ కాంటాక్ట్స్‌గా గుర్తించారు. ఇందులో విమానంలో అతని పక్కన కూర్చున్న వారు, సిబ్బంది, బాధితుడిని తిరువనంతపురం నుంచి కొల్లాంకు తీసుకెళ్లిన ట్యాక్సీ డ్రైవర్, అతన్ని ఆస్పత్రికి తరలించిన ఆటో డ్రైవర్ వున్నట్లు మంత్రి వీణాజార్జి చెప్పారు. 
 
ఇకపోతే.. జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వెన్నునొప్పి, గ్రంధులవాపు, అలసట, చలి, దద్దుర్లు, గజ్జి ఈ వ్యాధి లక్షణాలు. దీనికి టీకా లేదు. కోతులు, ఎలుకల ద్వారా ఇది వ్యాపిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు