భారత్ ప్రతీకారం.. సర్జికల్ స్ట్రైక్స్‌తో పాక్ సైనికులను కాల్చిపారేశారు

బుధవారం, 27 డిశెంబరు 2017 (09:31 IST)
సర్జికల్ స్ట్రైక్స్‌‌తో పాకిస్థాన్ సైనికులపై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. సరిహద్దు ఆవల అరకిలోమీటరు మేరకు చొచ్చుకెళ్లిన భారత్ సైనికుల బృందం.. మెరుపుదాడి జరిపి పాకిస్థాన్ సైనికులను కాల్చిపారేసింది. తద్వారా పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకుంది. ఇండియన్ ఆర్మీ.. ముగ్గురు పాక్ సైనికులను హతమార్చిందనీ పాక్ మిలిటరీ మీడియా కూడా నిర్ధారించింది. 
 
నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ నిరంతరం కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతున్న విషయం తెల్సిందే. దీంతో భారత్ సైన్యంపై నిరంతరం యధేచ్చగా కాల్పులకు పాల్లడుతోంది. తాజాగా సరిహద్దును దాటివచ్చి ఆర్మీ అధికారితో పాటు ముగ్గురు జవాన్లను పాకిస్థాన్ అర్మీ మట్టుబెట్టింది. ఈ దాడికి భారత్ ధీటుగా బదులిచ్చింది. వాస్తవాధీనరేఖ దాటి చొచ్చుకుపోయిన జవాన్లు.. ముగ్గురు పాక్ సైనికులను హతమార్చారు. మరో పాక్ సైనికుడు గాయపడ్డాడు.
 
సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో జమ్మూకాశ్మీర్‌లోని రావల్ కోట్ సెక్టార్ సమీపంలోని పాకిస్థాన్ సైనికుల తాత్కాలిక శిబిరంపై ఈ దాడి జరిగింది. ఐదుగురు సభ్యులతో ఉన్న భారత కమెండోల టీమ్ దాదాపు 300 మీటర్ల లోపలి వరకు పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లింది. 45 నిమిషాల్లోనే దాడిని కంప్లీట్ చేసి తిరిగి వచ్చింది.
 
అంతకుముందు.. మన ఆర్మీకి చెందిన నలుగురు జవాన్లను పాక్ సైన్యం ఇలాగే హతమార్చింది. దీంతో పాక్‌కు బుద్ధి చెప్పిన భారత సైన్యం.. దెబ్బకు దెబ్బ కొట్టినట్టయింది. అయితే ఇది సర్జికల్ స్ట్రయిక్స్ కాదని చెప్పిన కేంద్రం.. సరిహద్దులో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా సైన్యం స్పందించినట్టు చెప్పింది. సత్తా చాటారని ప్రశంసించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు