ప్రపంచదేశాలలో భారతదేశానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ భారత్‌కి అతి సమీపంలో ఉన్న ఇండోనేషియా భారత్‌ను ఎప్పుడూ గౌరవిస్తూనే వస్తోంది. భారత్‌తో దౌత్య సంబంధాలు ప్రారంభించి డెబ్బై ఏళ్లయిన సందర్భంగా ఇరుదేశాల సంబంధాలను గౌరవిస్తూ ఇండోనేషియా ప్రభుత్వం రామాయణ చిత్రంతో కూడిన స్మారక స్టాంపును విడుదల చేసింది.