దేశంలో బెస్ట్ స్మార్ట్ సిటీగా ఇండోర్ నగరం..

శనివారం, 26 ఆగస్టు 2023 (15:22 IST)
దేశంలో బెస్ట్ స్మార్ట్ సిటీగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరం నిలిచింది. ఆయా నగరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు అక్కడ ఉన్న సౌకర్యాలు ఇతర పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈ స్మార్ట్ సిటీలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. అందులో ఇండోర్ నగరం తొలి స్థానంలో నిలిచింది. 
 
కేంద్ర ప్రభుత్వం గత 2022 సంవత్సరానికిగాను ఇండియా స్మార్ట్ సిటీస్ అవార్డులను శుక్రవారం ప్రకటించింది. ఇందులో మధ్యప్రదేశ్ బెస్ట్ స్టేట్ అవార్డును గెలుచుకోగా, తమిళనాడు రాష్ట్రానికి రెండో అవార్డు దక్కింది. అలాగే, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లు సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి. 
 
ఇకపోతే, అత్యుత్తమ నగరాల్లో రెండో స్థానంలో సూరత్ నగరం నిలవగా, మూడో స్థానంలో ఆగ్రా నిలించింది. వివిధ ప్రాజెక్టుల ఫలితాలు, ప్రాజెక్టుల ప్రగతి, బహుమతుల కోసం ప్రజంటేషన్ ఇచ్చిన తీరు వంటి ఆధారంగా నగరాలు, రాష్ట్రాల్లో ఉత్తమమైనవాటిని కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్విత్వశాఖ ఎంపిక చేసింది. ఈ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చే నెల27వ తేదీన ఇండోర్‌లో జరిగే ఓ కార్యక్రమంలో ప్రదానం చేయనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు