తనకు బతకాలనే ఆశ ఏమాత్రం లేదనీ, అందువల్ల తనను ఉరితీయాలంటూ డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రాం రహీమ్ సింగ్ జైలు గదిలో బిగ్గరగా అరుస్తూ గగ్గోలు పెడుతున్నాడట. తన ఆశ్రమంలో ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో డేరా బాబాకు పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు 20 యేళ్ల జైలుశిక్ష విధించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈయనను రోహ్‌తక్‌లోని సునారియా జైలులో బంధించాడు. ఇదే జైలులో శిక్ష అనుభవిస్తూ వచ్చిన ఓ ఖైదీ బెయిల్‌పై విడుదలయ్యాడు.
అతను జైలు బయట మీడియాతో మాట్లాడుతూ... జైలుకి వచ్చిన రోజు రాత్రంతా నిద్రపోకుండా తాను చేసిన తప్పేంటని, ఈ శిక్ష ఎందుకు విధించారు దేవుడా? అని గుర్మీత్ సింగ్ బాధపడిపోయాడని చెప్పాడు. అంతేగాక, తనను ఉరితీయాలని, తనకు బతకాలని లేదని గుర్మీత్ బాబా వేడుకున్నాడని తెలిపాడు.
అలాగే, గుర్మీత్ బాబాని జైల్లో మిగతా ఖైదీల్లాగే చూస్తున్నారని, ఆయనకు వీఐపీ ట్రీట్‌మెంట్ ఏమీ లేదని ఆ ఖైదీ చెప్పాడు. కాగా, ఇద్దరు సాద్వీలపై అత్యాచారం చేసిన కేసులో గుర్మీత్ బాబాకు హర్యానాలోని పంచకుల సీబీఐ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, 15 లక్షల రూపాయల జరిమానా విధించిన విషయం తెలిసిందే.