డేరా సచ్చా సౌధా ఆశ్రయంలోని ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఈ ఆశ్రమం చీఫ్ గుర్మీత్ సింగ్‌కు పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు 20 యేళ్ళ జైలుశిక్ష విధించింది. అయితే, ఈ కేసులో దోషిగా తేలిన తర్వాత శిక్ష ఖరారు కోసం మరోమారు కోర్టులో వాదోపవాదనలు జరిగాయి. ఆ సమయంలో జడ్జి వద్ద గుర్మీత్ సింగ్ స్వయంగా తన వాదనలు వినిపించారు.
ఆ సమయంలో తాను 1990 నుంచి నపుంసకుడినని, తనకు లైంగిక సామర్థ్యం లేదని, శృంగారానికి పనికి రానని, ఇలాంటి పరిస్థితుల్లో తాను ఈ రెండు రేప్‌లు ఎలా చేస్తానని ప్రశ్నించాడు. ఈ రేప్ కేసు ఆరోపణలు 1999లో రావడంతో తెలివిగా తన వాదన వినిపించాడు.
అయితే విచారణ సందర్భంగా డేరాకు సంబంధించిన ఒక హాస్టల్ వార్డెన్ బాబా చాలా మంచివాడని సాక్ష్యమిస్తూ... ఆయన ఇద్దరు కుమార్తెలు కూడా డేరా ఆశ్రమంలోని హాస్టల్‌లోనే ఉంటున్నారని, ఆయన అందర్నీ బిడ్డల్లా చూసుకుంటారని సాక్ష్యమిచ్చారు.