ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు - వాతావరణ శాఖ హెచ్చరిక

ఆదివారం, 13 ఆగస్టు 2023 (10:43 IST)
ఇప్పటికే హిమాచల్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వెస్ట్ బెంగాల్, సిక్కిం రాష్ట్రాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేస్తూ వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే, వచ్చే 24 గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. 
 
ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వెస్ట్ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లోనూ రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఈ రెండు రాష్ట్రాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించింది. 
 
ఈ మేరకు ఐఎండీ ట్విట్టర్ ఎక్స్‌లో ట్వీట్ చేసింది. బెంగాల్, సిక్కింలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆగస్ట్ 12, 13 తేదీల్లో 115.6 మిల్లీ మీటర్ల నుంచి మిల్లీ మీటర్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చని తెలిపింది. ఉత్తరాఖండ్‌లో ఆగస్టు 12, 15, 16 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ ప్రాంతాల్లో 115 నుంచి 204 మిల్లీ మీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
 
కాగా, ఇప్పటికే ఉత్తరాఖండ్‌లోని పలు జిల్లాల్లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మండి జిల్లాలో బియాస్ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. 
 
మరోవైపు, రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనంతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తిరుపతి, కడప, అన్నమయ్య నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు