ఈ దాడిపై రామ్ గోపాల్ వర్మ స్పందించారు. "పని లేని వాళ్లు కాసేపు అరిస్తే పబ్లిసిటీ వస్తుంది. అందుకే నా ఆఫీసుపై దాడి చేశారు. దాడి చేసిన వాళ్లు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అని నేను చెప్పను. జనసేన, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎవరో నాకు తెలియదు. చాలామంది పనిలేని వాళ్లు ఇలాంటివి చేస్తూ ఉంటారు. వాళ్లను పోలీసులు తీసుకెళ్లారు" అని రామ్ గోపాల్ వర్మ తెలిపారు.