ఒకే దేశం.. ఒకే ఎన్నికలు : జమిలి ఎన్నికలు అవశ్యం : ప్రధాని నరేంద్ర మోడీ

శుక్రవారం, 27 నవంబరు 2020 (05:33 IST)
ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక కీలక మార్పులు చేస్తున్నారు. ఒకే దేశం ఒకే పన్ను అనే విధానాన్ని అమలు చేశారు. అలాగే, దేశ వ్యాప్తంగా ఒకే విధమైన పలు చట్టాలను అమలు చేస్తున్నారు. ఈ కోవలోనే ఒకే దేశం, ఒకే ఎన్నికలు అనే నినాదాన్ని అందుకున్నారు. అంటే.. జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు ఆయన మొగ్గు చూపుతున్నారు. 
 
ఈ క్రమంలో గురువారం ఢిల్లీలో 80వ ఆలిండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ జమిలి ఎన్నికలపై చర్చ చాలా అనవసరమన్నారు. దేశానికి జమిలి ఎన్నికలు అత్యంత అవశ్యమని చెప్పారు.
 
మన దేశంలో ఎప్పుడూ ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయని... దేశ అభివృద్ది కార్యక్రమాలపై దీని ప్రభావం పడుతోందని అన్నారు. ఈ విషయం ప్రజలకు కూడా అర్థమవుతూనే ఉందన్నారు. ఈ సమస్యపై, జమిలి ఎన్నికలపై అధ్యయనం జరగాల్సి ఉందని... ప్రిసైడింగ్ అధికారులు దీనిపై తగిన మార్గదర్శకం చేయాలని అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు