జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లా లాసీపొరలో సోమవారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. గత ఫిబ్రవరి నెల 14వ తేదీన పుల్వామా జిల్లాలోని లాథపొరాలో భారత భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని జైషే మొహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన తీవ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మొత్తం 40 మంది భద్రతా సిబ్బందితో పాటు.. ఒక ఆత్మాహుతి దళ సభ్యుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తలు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. సోమవారం తెల్లవారుజామూన జమ్మూకాశ్మీర్లోని పుల్వామా జిల్లా లాసీపొర ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జగిగాయి. ఈ భీకర కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. లాసీపొర ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో సీఆర్పీఎఫ్ జవాన్లు, కాశ్మీర్ సాయుధ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
డిని తిప్పికొట్టిన భద్రతా దళాలు నలుగురు ఉగ్రవాదులను హతమర్చారు. అయితే ఈ కాల్పుల్లో ముగ్గురు సిబ్బంది కూడా గాయపడ్డారు. సంఘటనా స్థలిలో రెండు ఏకే రైఫిల్స్, ఒక ఎస్‌ఎల్‌ఆర్, ఒక తుపాకీని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు.