పిజ్జా డ్రోన్లతో దాడులు జరుపుతారా?

బుధవారం, 30 జూన్ 2021 (10:17 IST)
పిజ్జా డ్రోన్లతో దాడులు జరుపుతారా అంటే.. అవునని సమాధానం వస్తోంది. పాక్ ఉగ్రవాదులు జమ్ము వైమానిక స్థావరంపై ఆదివారం దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆదివారం తెల్లవారుజామున రెండు డ్రోన్‌ దాడులు జరిగాయి. దీనిపై భారత భద్రతా సంస్థలు దర్యాప్తు చేపట్టాయి.
 
చైనా నుంచి పాకిస్తాన్ పెద్ద ఎత్తున డ్రోన్లను కొనుగోలు చేసినట్లు నిఘా వర్గాల నుంచి భారత భద్రతా సంస్థలకు సమాచారం వచ్చింది. వీటిని పిజ్జాలు, మందుల సరఫరా కోసం..వాడనునున్నట్లుగా పాక్ వెల్లడించినట్లు సమాచారం. ఈ డ్రోన్లనే జమ్ము వైమానిక స్థావరంపై పాక్ ఉగ్రవాదులు ఉపయోగించినట్లు తెలుస్తోంది. పేలుడు పదార్థాలపై NIA చెందిన ప్రత్యేక స్కాడ్‌ బృందం దర్యాప్తు చేపట్టింది. ఉగ్రవాదులు ఆర్డీఎక్స్ బాంబులు వాడి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా డ్రోన్‌ మార్గాలను పరిశీలిస్తున్నారు.
 
మరోవైపు…వైమానిక స్థారంపై డ్రోన్ల దాడి వెనుక నిషేధిత లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థ ఉండొచ్చని జమ్ము కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ వెల్లడించారు. పౌర అవసరాలకు కూడా అనుమతి లేకుండా..డ్రోన్లను వినియోగించవద్దని ఆదేశించారు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు