అమ్మ ఆరోగ్యంపై అపోలో రోజుకో ప్రకటన.. ప్రకటనలు.. బులిటెన్లు వద్దు.. ఫోటోలు విడుదల చేయండి..

సోమవారం, 5 డిశెంబరు 2016 (18:15 IST)
తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితిపై రోజుకో వార్త పుట్టుకొస్తుంది. రెండు నెలల పాటు ఆమె ఆరోగ్యంపై అపోలో వైద్యులు నానా రకాల వార్తలు ప్రచురిస్తున్నారు. అమ్మ ఫోటోను విడుదల చేయకుండానే అమ్మ ఆరోగ్యంపై అపోలో వైద్యులు ప్రకటనలు, బులిటెన్లు విడుదల చేస్తున్నారు.
 
తమిళ మీడియాలో అమ్మ మరణించినట్లు వార్తలు గుప్పుమనడంతో అమ్మ చికిత్సకు స్పందిస్తున్నారని.. టీవీల్లో వచ్చే వార్తల్లో నిజం లేదని అపోలో ప్రెస్ రిలీజ్ చేసింది. అమ్మకు వైద్యులు, స్పెషలిస్టులు వైద్యం అందిస్తున్నారు. తమిళ మీడియాలో జయలలిత మరణించినట్లు వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. ఆమె ప్రాణాలతోనే ఉన్నారని, అమ్మ ఆరోగ్యంపై తమిళ ఛానళ్లలో వచ్చే వార్తల్లో నిజం లేదని అపోలో నిర్వాహం ప్రకటించింది. 
 
అపోలోలో వైద్యులు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. అమ్మ ఆరోగ్యంపై ఫోటోలు విడుదల చేయకుండానే ఆమె కోలుకున్నారని, మెరుగైన చికిత్సకు స్పందిస్తున్నారని ప్రకటనలు చేయడంపై అన్నాడీఎంకే కార్యకర్తలు, ప్రజలు మండిపడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఆందోళనలకు బ్రేక్ పడాలంటే.. అమ్మ ఫోటోలను విడుదల చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి