ఆధ్యికంలో జయలలిత... తొలి రౌండుకు 8,632 ఓట్ల ఆధిక్యత

మంగళవారం, 30 జూన్ 2015 (09:57 IST)
కోర్టు కేసు నుంచి బయట పడిన తరువాత తొలి ఎన్నికలను ఎదుర్కొంటున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆర్కేనగర్ ఉప ఎన్నికలలో మొదటి రౌండ్ లెక్కింపు పూర్తయ్యే సమయానికి 8632 ఓట్ల మెజారిటీ ఉన్నారు. వివరాలిలా ఉన్నాయి. 
 
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అసెంబ్లీ సభ్యత్వం నిమిత్తం పోటీ చేసిన ఆర్ కే నగర్ నియోజకవర్గ ఉపఎన్నికలో ఓట్ల లెక్కింపు మొదలైంది. తొలి రౌండులో ఆమె 8,632 ఓట్ల ఆధిక్యాన్ని పొందారు. ఈ ఎన్నికల్లో పోటీనే ఉండదనుకుంటే ఏకంగా 28 మంది పోటీలో నిలబడ్డారు. 
 
అయితే జయలలిత తొలి రౌండులోనే స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించారు. ఆమె సమీప అభ్యర్థులెవరికీ నాలుగంకెల ఓట్లు రాలేదని తెలుస్తోంది. 25 మంది అభ్యర్థులకు పడ్డ ఓట్లు 100కు లోపేనని సమాచారం. ఈ మధ్యాహ్నానికి పూర్తి ఫలితం వెలువడుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి