సీఎం హేమంత్‌ సోరెన్‌పై అత్యాచార ఆరోపణలు.. లైట్‌గా తీసుకున్న బీజేపీ ఎంపీ

శనివారం, 8 ఆగస్టు 2020 (13:32 IST)
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌పై బీజేపీ ఎంపీ సోషల్ మీడియాలో ఆత్యాచార ఆరోపణలు చేశారు. 2013లో సోరెన్ ముంబైలో ఓ మహిళపై అత్యాచారం చేశారని ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో హేమంత్ సోరెన్‌ బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబేపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. 
 
సోషల్ మీడియాలో బీజేపీ ఎంపీ డాక్టర్ నిషికాంత్ దూబే తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, రాంచీ సివిల్ కోర్టులో పరువునష్టం దావా దాఖలు చేశారు. ఇందులో బీజేపీ ఎంపీతో పాటు ట్విట్ట‌ర్ ఇండియా, ఫేస్ బుక్ ఇండియాల‌ను కూడా చేర్చారు. 
 
త‌న‌పై ఆరోప‌ణ‌లు చేసిన ఎంపీతో పాటు ఆ ఆరోప‌ణ‌ల‌ను నిర్ధారించుకోక‌ముందే త‌మ ఫ్లాట్ ఫామ్స్ నుండి తొల‌గించ‌లేద‌ని సీఎం పిటిష‌న్‌లో పేర్కొన్నారు. ఆగ‌స్టు 22న ఈ కేసులో పూర్తి స్థాయి వాద‌న‌లు కొన‌సాగ‌నున్నాయి. 
 
సీఎం ప‌రువున‌ష్టం దావాను బీజేపీ ఎంపీ లైట్‌గా తీసుకున్న‌ట్లు క‌న‌ప‌డుతోంది. ట్విట్ట‌ర్ వేదిక‌గా బీజేపీ ఎంపీ త‌న విమ‌ర్శ‌లు కొన‌సాగిస్తూనే ఉన్నారు. మీపై ముంబైలో ఓ యువ‌తి రేప్ కేసు పెట్టింది. మీరు ఆమెపై న్యాయ పోరాటం చేయాల‌ని… నా మీద కాకుండా త‌న‌పై కేసు పెట్టాలంటూ ఎంపీ కామెంట్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు