ఆదివాసీలకు ముద్దుల పోటీ.. ఎందుకో తెలుసా? (వీడియో)

మంగళవారం, 12 డిశెంబరు 2017 (11:07 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో ఓ ప్రజాప్రతినిధి ఆదివాసీ తెగకు చెందిన ప్రజలకు ముద్దులపోటీ పెట్టారు. ఇలా ఎందుకు పెట్టారనీ మీడియా ప్రశ్నిస్తే ఆయన చెప్పిన సమాధానంతో ప్రతి ఒక్కరూ షాక్‌కు గురయ్యారు. ఆదివాసీ ప్రజల్లో ఆధునికవాదం, ప్రేమలాంటి భావనలు ప్రోత్సహించేందుకు ఈ తరహా ముద్దుల పోటీలను నిర్వహించినట్టు చెప్పారు.
 
ఈ పోటీలను పెట్టిన ఎమ్మెల్యే పేరు సైమన్ మరాండీ. ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా(జేఎంఎం) ఎమ్మెల్యే. లిట్టిపారాలోని తాల్‌పహరీ గ్రామంలో శనివారం రాత్రి ఈ పోటీలను నిర్వహించగా, తాజాగా ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో కనిపించింది. 
 
గిరిజన జంటలకు ముద్దుల పోటీ నిర్వహించడంతోపాటు.. అవార్డులనూ ఆయన అందించారు. కార్యక్రమానికి వందల మంది ప్రజలు, పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ వార్తను ఫోటలతో సహా సోమవారం స్థానిక పత్రికలు ప్రచురించాయి. దీంతో ఒకరినొకరు అర్థంచేసుకోవడానికి, విడాకులను తగ్గించడానికి ఈ పోటీ తోడ్పడుతుందంటూ సైమన్‌ తన చర్యలను సమర్థించుకున్నారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు