దుండుగులు అత్యంత విచక్షణారహితంగా ప్రవర్తినంచినట్టు తెలుస్తోంది. కేజే సింగ్‌ను పొట్టలో కత్తితో పొడిచి, గొంతు కోసిన దుండగులు ఆయన తల్లి కౌర్‌ను గొంతునులిమి చంపారు. వీటిపై అనుమానాస్పద హత్యగా భావించిన పంజాబ్ ప్రభుత్వం ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణకు ఆదేశించింది.
అలాగే, కేజేసింగ్ ఇంటికి రెండు ఇళ్ల తర్వాత ఏర్పాటు చేసిన సీసీకెమెరా ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. అవివాహితుడైన కేజే సింగ్.. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ద టైమ్స్ ఆఫ్ ఇండియాలో న్యూస్ ఎడిటర్‌గా పని చేశారు. ప్రస్తుతం కెనడాకు చెందిన పత్రికకు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గాసింగ్ పనిచేస్తున్నారు.
కాగా మొన్నటికి మొన్న కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో సంఘ సేవకురాలు, సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేష్‌ను ఇదే విధంగా గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపిన విషయం తెల్సిందే. ఈ హత్యపై దేశ వ్యాప్తంగా దుమారం చెలరేగింది.