సుప్రీం కోర్టు తీర్పు రాగానే మరోసారి టీవీ ఛానళ్ల కళ్లన్నీ అతడిమీదే పడతాయి కాబట్టి.. అతడు ఎక్కడున్నాడో కూడా ఎవరికీ చెప్పడం లేదు. చివరకు అతడు పనిచేసే ధాబా యజమానికి కూడా అతడు ఫలానా అని తెలియదు. ఓ స్వచ్ఛంధ సంస్థ మాత్రం జైలు నుంచి విడుదలైన ఏడాది తర్వాత మైనర్ దక్షిణాదిన ఒక ధాబాలో వంటవాడిగా చేర్చినట్లు తెలిపింది.
2015 డిసెంబర్ 20వ తేదీన అతడు విడుదలైన సంగతి తెలిసిందే. కొన్నాళ్ల పాటు ఒక స్వచ్ఛంద సంస్థ వద్ద ఉన్నాడు. ఆ తర్వాత వంటవాడిగా వచ్చేశాడు. ఢిల్లీకి 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇంటి నుంచి 11 ఏళ్ల వయసులో అతడు పారిపోయి వచ్చేశాడు. ఢిల్లీ వచ్చిన తర్వాత నిర్భయ కేసులో మరో నిందితుడైన రామ్‌సింగ్ పంచన చేరాడు. అతడి దగ్గర బస్సు క్లీనర్ పనిలో కుదురుకున్నాడు. ఆ సమయంలోనే నిర్భయ కేసులో నిందితుడయ్యాడు.