కాపు రిజర్వేషన్లపై ఈ నెల 24లోపు స్పష్టమైన వైఖరిని ప్రకటించకపోతే.. భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ఏపీ సీఎం చంద్రబాబును కాపు జేఏసీ నేతలు హెచ్చరించారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి.. ఇద్దరూ కూడా కాపులను మోసం చేశారన్నారు. చంద్రబాబు, జగన్ తమను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని కాపు జేఏసీ నేత సత్యనారాయణ ధ్వజమెత్తారు.
ఈ ఇద్దరు నేతలు కూడా కాపులకు అనుకూలంగా ప్రకటనలు చేసి ఆ తరువాత యూ-టర్న్ తీసుకున్నారని సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. సుప్రీంకోర్టు యాభై శాతం రిజర్వేషన్లు దాటకూడదని చెప్పిన మాట వాస్తవమే అయినా... దాన్ని మార్చేలా పార్లమెంటులో చట్టం చేసే అవకాశం ఉందని, ఆదిశగా ఎందుకు ప్రయత్నాలు చేయడం లేదని సత్యనారాయణ ప్రశ్నించారు.