Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

దేవీ

గురువారం, 28 ఆగస్టు 2025 (17:50 IST)
Ram Charan's Peddi song shoot at Mysore, johny master, buchibabu and team
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా స్పెక్టకిల్ "పెద్ది", ఈ సినిమా కోసం స్టైలిష్ మేకోవర్స్, పవర్‌ఫుల్ ఫిజికల్ ట్రాన్స్‌ఫార్మేషన్, స్పెషల్ ట్రైనింగ్.. ఇలా అన్ని రకాలుగా క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అవ్వడానికి తన బెస్ట్ ఇస్తున్నారు రామ్ చరణ్. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు భారీగా నిర్మిస్తున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ప్రెజెంట్ చేస్తున్నారు. టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ లుక్, రామ్ చరణ్ మేకోవర్ ఫ్యాన్స్‌లో, సినిమా లవర్స్‌లో అంచనాలు పీక్స్‌కి తీసుకెళ్లాయి.
 
ఇప్పుడు మేకర్స్ మైసూర్‌లో రామ్ చరణ్ మీద ఒక గ్రాండ్ సాంగ్ షూట్ స్టార్ట్ చేశారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్న ఈ సాంగ్‌కి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రహ్మాన్ మ్యాసీవ్ సాంగ్ ని అందించారు. వెయ్యి మందికి పైగా డ్యాన్సర్లతో పిక్చరైజ్ అవుతున్న ఈ సాంగ్ కచ్చితంగా ఒక విజువల్ ఫీస్ట్ లా ఉంటుంది. రామ్ చరణ్ తన ట్రేడ్‌మార్క్ ఎనర్జీ, గ్రేస్‌తో చేసిన మాస్ స్టెప్స్ ఈ సాంగ్‌ ని హైలైట్‌గా నిలపడం ఖాయం.
 
దేశం మొత్తం వినాయక చవితి పండుగ ఉత్సాహంలో వునప్పటికీ "పెద్ది" టీమ్ మాత్రం షూటింగ్‌లో బిజీగా ఉండి నిబద్ధతతో పనిచేస్తూనే ఉంది. ఈ డెడికేషన్‌ ని ఖచ్చితంగా అభినందించాలి. 
 
ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ పవర్‌ఫుల్ రోల్ చేస్తున్నారు. జగపతి బాబు, దివ్యేందు శర్మ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
 
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ రత్నవేలు, నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటర్. 
 
పెద్ది మార్చి 27, 2026న పాన్ ఇండియా గా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.  
 
నటీనటులు: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు