కర్నాటక రాష్ట్రంలోని చామరాజ్ నగర్‌లో ఓ బీటెక్ కుర్రోడు వెలుగు పూలు పూయిస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వరించినా దాన్ని తిరస్కరించి వ్యవసాయాన్ని నమ్ముకుని, యేడాదికి 15 నుంచి 18 లక్షల మేరకు ఆదాయాన్ని అర్జిస్తున్నాడు. తన కుమారుడు బీటెక్ పూర్తిచేసి కూడా వ్యవసాయం చేయడం పట్ల అతని తండ్రి మురిసెపోతున్నాడు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చామరాజ్ నగర్‌కు చెందిన సతీశ్ అనే యువకుడు బీటెక్ పూర్తిచేశాడు. ఆ తర్వాత యూపీపీఎస్సీ పరీక్ష రాశాడు. ఇందులో ఉత్తీర్ణులై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత సాధించాడు. అయితే, ఆ ఉద్యోగంలో చేరకుండా, తనకున్న ఎకరా పొలాన్ని నమ్ముకున్నాడు.
ఒక్కో పువ్వు ధర 3-10 రూపాయల వరకు పలుకుతుంది. ఈ పంటకో విశేషం ఉంది. 24 గంటలూ వెలుతురు అవసరం. దీంతో రాత్రుళ్లు విద్యుత్తు దీపాల వెలుగులందిస్తున్నాడు. బీటెక్ చేసి.. యూపీఎస్‌సీ పరీక్షల్లోనూ అర్హత సాధించిన సతీశ్ సాగును నమ్ముకోవడంతో ఆయన తండ్రి మురిసిపోతున్నారు. లైట్లు, కూలీలు లాంటి ఖర్చులన్నీ కలిపి ఏడాదికి దాదాపు 6 లక్షలవుతుంటే..ఆదాయం సుమారు రూ. 15-18 లక్షల మధ్య ఉంటున్నట్లు సతీశ్ చెబుతున్నాడు.