దొడ్డబళ్లాపుర తాలూకాలోని కోడిహళ్లీ గ్రామానికి చెందిన 35 ఏళ్ల గాయత్రిపై అదే ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల కిరణ్‌కుమార్ మనసుపడ్డాడు. కిరణ్‌కుమార్ పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు తప్పెట వాయించే పని చేస్తుంటాడు. ఆ కుర్రాడిని చూసి గాయత్రి కూడా మనసుపడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆ విషయం అమె భర్త ఉమేశ్ దృష్టికి వెళ్లింది. గాయత్రిని పద్ధతి మార్చుకోమని హెచ్చరించాడు. అయినా అమె అతని మాటలు పెడచెవిన పెట్టింది. పలుమార్లు ఇద్దరూ గొడవపడ్డారు. తన అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన గాయత్రి అతడిని చంపేయాలనుకుంది.
ప్రియుడిని సంప్రదించి ఈ విషయం చెప్పింది. దానికి కిరణ్ కూడా సరే అన్నాడు. ఇద్దరూ కలిసి ప్రణాళిక సిద్ధం చేసారు. పథకం ప్రకారం ఉమేశ్‌ను బైక్ మీద రాజఘట్ట గ్రామంలో పని ఉందని తీసుకెళ్లాడు కిరణ్. వీరితోపాటు 18 ఏళ్ల కిరణ్ తమ్ముడు కూడా ఉన్నాడు. ఆ రోజు అక్కడే కిరణ్‌కు తెలిసిన వారి ఇంట్లో బస చేసిన ఉమేశ్‌ను తర్వాతి రోజు ఉజ్జిని సమీపంలో ఉన్న అడవిలోకి తీసుకెళ్లాడు.
కిరణ్ తనతోపాటు తెచ్చిన వైర్‌తో ఉమేశ్ పీకకు చుట్టి చంపేశాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి బండరాయితో తలపై మోదారు. శవాన్ని అడవిలోనే వదిలేసి ఏమీ తెలియనట్లు స్వగ్రామానికి వచ్చేశారు. అటివీ ప్రాంతంలో శవాన్ని గుర్తించిన పోలీసులు అనుమానాస్పద మృతి క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.