అగ్నపథ్ ఆపేసి యువత ఆందోళనలపై దృష్టిసారించండి : కేరళ సీఎం

ఆదివారం, 19 జూన్ 2022 (17:40 IST)
భారత సైన్యంలో సాయుధ బలగాల నియామకం కోసం కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని తక్షణం నిలిపివేయాలని కేంద్రానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. అదేసమయంలో ఈ అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశ యువతలో నెలకొన్న ఆందోళనపై దృష్టిసారించాలని ఆయన విన్నవించారు. 
 
ఇండియన్ ఆర్మీలో భారీ నియామకాలు, దేశ యువతకు ఉద్యోగాల కల్పన దేశగా కేంద్రం ఈ అగ్నివీరులు పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకానికి దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు అనేక రాష్ట్రాలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. పలు రాష్ట్రాల్లో హింసాత్మక సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. దీంతో కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్ రంగంలోకి దిగి పరిస్థిని చక్కదిద్దే అంశంపై దృష్టిసారించారు. ఇందులోభాగంగా, ఆయన త్రివిధ దళాధిపతులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఆదివారం ఒక్క రోజే వరుసగా రెండుసార్లు భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత త్రివిధ దళాధిపతులు అగ్నిపథ్ పథకంపై వెనకడగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అంతేకాకుండా, అగ్నవీరులకు లభించే సౌలభ్యాలను కూడా వారు వివరించారు. 
 
ఇదిలావుంటే, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోడీకి లేఖ రాశారు. తక్షణమే అగ్నిపథ్ పథకాన్ని నిలిారు. లని ఆయన డిమాండ్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు