మనువరాలిపై ఏడాదిపాటు తాత అత్యాచారం.. వేధింపులు తాళలేక బాధితురాలి ఆత్మహత్య

సోమవారం, 20 మార్చి 2017 (16:36 IST)
వావివరసలు మంటగలిసిపోయాయి. కామాంధులు పెచ్చరిల్లిపోతున్నారు. వయో తారతమ్యం లేకుండా బాలికల నుంచి ముదుసలి వరకు కామాంధులు లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటికే కన్నకూతురిపై ఓ తండ్రి అత్యాచారానికి పాల్పడిన ఘటనలు ఎన్నో విన్నాం. తాజాగా తాతల వంతు వచ్చేసింది. అల్లారుముద్దుగా పెంచాల్సిన మనువరాలిని తాతే పొట్టనబెట్టుకున్నాడు. మనవరాలిపై అత్యాచారానికి ఏడాదిగా పాల్పడ్డాడు.  
 
ఈ వేధింపులు భరించలేక బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కేరళలోని కొల్లంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేరళలోని కుందారా ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలిక ఇటీవల ఆత్మహత్య చేసుకొంది. ఈ ఘటనపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులకు షాక్‌కు గురిచేసే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 
 
మైనర్ బాలిక అయిన మనమరాలిపై ఏడాదిగా తాత డేనియల్ (62) అత్యాచారానికి పాల్పడినట్లు తేలింది. అంతేగాకుండా ఆమె ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడని కూడా పోలీసుల విచారణలో తేలింది. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇతడు లాడ్జ్‌లో మేనేజర్‌గా పనిచేశాడని, ఇతనిపై అసహజ సెక్స్ కోసం లాడ్జ్‌లు నడిపినట్లు కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి