ఐస్ క్రీమ్‌లో విషం కలిపి సోదరిని చంపేసిన సోదరుడు..

శుక్రవారం, 14 ఆగస్టు 2020 (11:53 IST)
ఐస్ క్రీమ్‌లో విషం కలిపి సోదరిని చంపేశాడు ఓ సోదరుడు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. సోదరుడు తోబుట్టువుతో కలిసి వుండటం ఇష్టం లేక ఒంటరిగా జీవించాలనే ఉద్దేశంతో సోదరిని హతమార్చాడు. ఐస్‌క్రీమ్‌లో విషం కలిపిన సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తల్లిదండ్రుల ప్రేమ తనకు లభించాలనే ఉద్దేశంతో సోదరిని 22 ఏళ్ల సోదరుడు హత్య చేశాడు. ఇతనిని గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
ఆగస్టు 5న కాసరగోడ్‌ చోటుచేసుకున్న ఈ ఘటనలో 16 ఏళ్ల యువతి మృతి హత్య అని దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. ఇంకా ఆమె తీసుకున్న ఐస్‌క్రీములో విషం కలిపినట్లు ఒప్పుకున్నాడు. ఈ మేరకు మృతురాలి సోదరుడు ఆల్బిన్ వాంగూల్మం రికార్డ్ చేశామని పోలీసులు చెప్పారు. ఐస్‌క్రీమ్ తీసుకున్న కూతురుని తండ్రి ఆస్పత్రిలో చేర్చాడు. కానీ ఆమె ఆరోగ్యం విషమించి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు