తమిళనాడు కాంగ్రెస్ పార్టీకి కొత్త సారథ్యం రాబోతోంది. చాలా రోజుల తరువాత ఒక మహిళకు ఆ పగ్గాలను కాంగ్రెస్ పార్టీ అప్పజెబుతోంది. ఆమె ఎవరో కాదు సినీ నటి ఖుష్భూ. ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పిన ఖుష్భూకే ఆ పదవి అప్పగించాలన్న నిర్ణయానికే అధిష్టానం వచ్చేసింది. పండుగ రోజే అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతం పరిస్థితుల్లో తమిళనాడులో ప్రజల్లో చరిష్మా ఉన్న నేత ఉంటే బాగుంటుందన్నది కాంగ్రెస్ అధినేతల ఆలోచన. అందుకే ఖుష్భూను ఎంచుకున్నారు.
అందులోను మెగాస్టార్ చిరంజీవి ఖుష్భూకు రెకమెండేషన్ చేయడంతో అధిష్టానం కాదనలేకపోయింది. చిరు, ఖుష్భూలిద్దరు గతంలో ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. ఇద్దరికి మంచి పరిచయం ఉంది. రాజకీయాల్లో మాత్రం ఇద్దరు మొదట్లో వేర్వేరుగా ఉన్నా ఆ తరువాత సినిమా ఫంక్షన్లలో మాత్రం పరిచయం కొనసాగుతూ వచ్చింది. అది కాస్త ఇప్పుడు ఖుష్భూ రాజకీయంగా నిలబడేందుకు దోహదం చేస్తోంది. తమిళనాడులో ఇప్పటికే సినీనటులు రాజకీయ రంగప్రవేశం చేస్తారన్న ప్రచారం జరుగుతుండటంతో ఖుష్బూను కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దింపుతోంది.