మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు తినేందుకు ఉపయోదించే ప్లేట్లతో ఉపాధ్యాయులు టాయిలెట్స్ క్లీన్ చేయించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని దమోహ్ జిల్లాలోని దోలి గ్రామంలో తినడానికి ఉపయోగించే ప్లేట్లతో ఉపాధ్యాయులు విద్యార్థులు టాయిలెట్స్ క్లీన్ చేయించారు.
దీంతో స్కూలు ముగిసిన తరువాత ఇంటికి వెళ్లిన పిల్లలు... టాయిలెట్‌లోని వ్యర్థాలను తినే ప్లేట్లతో ఎత్తించారని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారంతా టీచర్లను నిలదీసేందుకు పాఠశాలకు వెళ్లగా, అప్పటికే వారంతా స్కూలు నుంచి వెళ్లిపోయినట్లు పిల్లల తల్లిదండ్రులకు చెప్పారు. తల్లిదండ్రులంతా పాఠశాలలో ఆందోళన చేపట్టారు.