మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు గత ఐదు రోజులుగా పార్లమెంట్ వేదికగా చేసుకుని చేస్తున్న ఆందోళనలపై భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ ఆరా తీశారు. ఇదే అంశంపై టీడీపీ ఎంపీలతో 10 నిమిషాల పాటు మాట్లాడారు. ఈ సందర్భంగా విభజన హామీలు, సభలో ఎందుకు నిరసన తెలుపుతున్నామో, ఇతర పరిణామాల గురించి తెదేపా నేతలు అద్వానీకి వివరించారు. పైగా, ఆందోళనలు, నిరసలను సభా నియమాలకు అనుగుణంగా చేసుకోవాలంటూ హితవు పలికారు.
అనంతరం అద్వానీ వారితో మాట్లాడుతూ ఏపీకి కేంద్రం న్యాయం చేయాల్సి ఉందని అభిప్రాయపడినట్లు సమాచారం. ఒకరినొకరు గౌరవించుకోవాలని, సభా మర్యాదలు కాపాడుకోవాలని సూచించారు. ఏపీ వ్యవహారంపై ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీతోనూ మాట్లాడానని ఎంపీలతో చెప్పారు. ఎందుకిలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావట్లేదంటూ ఆయన ఎంపీల వద్ద నిరాశ వ్యక్తపరిచినట్లు సమాచారం.