ముఖ్యంగా, విభజన హామీల పరిష్కారంతో పాటు నిధుల కేటాయింపులో బీజేపీ పూర్తిగా అన్యాయం చేయడాన్ని ఏపీ ప్రజలతో పాటు టీడీపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో పార్లమెంట్ వేదికగా చేసుకుని నిరసలు, ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు.
ఈనేపథ్యంలో తెదేపా ఎంపీలు రాయపాటి సాంబశివ రావు, కేశినేని నాని, సీఎం రమేష్ తదితరులు బీజేపీపై నిప్పులు చెరిగారు. తమ ఆందోళన సభలో కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ కంటే బీజేపీ పెద్ద మోసం చేసిందని, వారి కంటే పెద్ద మోసగాళ్లు బీజేపీ నేతలేనని ఆగ్రహించారు.
కాంగ్రెస్ తలుపులు వేసి అన్యాయం చేస్తే, వీళ్లు తలుపులు తెరిచి మోసం చేశారని రాయపాటి ధ్వజమెత్తారు. 'బాహుబలి' చిత్రం సాధించిన కలెక్షన్ల కంటే ఏపీకి తక్కువ ఇచ్చారని గల్లా జయదేవ్ ఘాటైన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.