సమోసాలో ఆలు ఉన్నన్ని రోజులు బిహార్లో లాలూ ఉంటాడు.. ఓ బహిరంగ సభలో స్వయంగా లాలూ ప్రసాద్ యాదవే చెప్పిన మాట ఇది. అయితే దానా కుంభకోణంలో అరెస్ట్ జైలు పాలయినప్పటికీ బిహార్ ప్రత్యక్ష రాజకీయాల్లో లాలూ కనిపించలేదు.
2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ మేనియాను మహాగట్బంధన్తో ఎదుర్కొని మండల్ పార్టీలను గెలిపించిన లాలూ.. 2020 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేకపోయారు. రాజకీయపరమైన సలహాలు ఎప్పటికప్పుడు ఇస్తున్నప్పటికీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఎక్కడా కనిపించలేదు.
కాగా, చాలా కాలం తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రత్యక్ష రాజకీయ రంగంలోకి దిగనున్నారు. బిహార్లోని తారాపూర్, ఖుషేవ్వర్ నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికల ప్రచారంలో లాలూ ప్రసాద్ యాదవ్ పాల్గొననున్నారని రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ పేర్కొంది.
ఈ రెండు నియోజకవర్గాల్లో అక్టోబర్ 27న నిర్వహించే ఎన్నికల ప్రచార ర్యాలీలో లాలూ పాల్గొని ప్రసంగించనున్నరట. లాలూ రాకతో ఆర్జేడీలో మరింత ఉత్సాహం వస్తుందని ఆ పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.