ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విశ్వంభర, మా శివశంకర ప్రసాద్ గారు అనే రెండు సినిమాల తాలూకా స్టిల్స్, గ్లిప్లింగ్స్ ను దర్శకుడు విడుదల చేశారు. విశ్వంభర కథ కల్పితంగా పురాణాల్లో చెప్పిన 14 లోకాల్లో సత్య లోకంలో వింత మనుషులు, జంతులు నేపథ్యంలో దర్శకుడు వశిష్ట కథా వస్తువు ఎన్నుకోగా, మా శివశంకర ప్రసాద్ గారు సినిమాలో గతంలో చిరంజీవి చేసిన ఘరానా మొగుడు, దొంగ మొగుడు తరహాలోని మేనరిజాన్ని తీసుకుని సూటూబూటుతో ఇంటిలిజెంట్ డిపార్ట్ మెంట్ ఆఫీసర్ గా జోడించి విడుదల చేశారు. ఈ రెండింటిలోనూ పాత్రలు భిన్నమైనవే.
అయితే ఈ పాత్రలకు చిరంజీవి తన బాడీని తగ్గించుకోవడం విశేషం. రెండు పూటలా రోజూ జిమ్ కు వెళ్ళి కసరత్తు చేసి మేకప్ తో అందంగా తయారైనట్లుగా దర్శకుడు అనిల్ రావిపూడి మాటలను బట్టి తెలుస్తోంది. అయితే షూటింగ్ లేనప్పుడు మామూలుగా వుండేట్లుగా ఆయన బయట తిరగడం కూడా కొంచెం గుసగుసలకు తావించింది. ఇటీవలే మెగా బ్లండ్ క్యాంప్ ను హైటెక్ సిటీలో ఏర్పాటు చేసిన ఈవెంట్ ఆయన కనిపించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బాగా స్లిమ్ గా వున్నా, ముఖంలో కాస్త డల్ నెస్ కూడా వున్నట్లు గోచరించింది. ఇలా వున్నా ఆయన మాటల్లో చురుకుదనం తగ్గలేదు. అలాంటి చిరంజీవిని అనిల్ రావిపూడి పూర్తికా మార్చేశాడు. రేపు సెకండ్ షెడ్యూల్ లో మరింత ఆకర్షణీయంగా చూపిస్తానని గంటాపథంగా చెబుతున్నారు.