లాలూకు కిడ్నీ ఆపరేషన్ విజయవంతం

సోమవారం, 5 డిశెంబరు 2022 (19:02 IST)
ఆర్జేడీ అధినేత, బిహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు సోమవారం నిర్వహించిన కిడ్నీ ఆపరేషన్ విజయవంతమైంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయనకు రెండు కిడ్నీలు విఫలమైనట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆయనకు కిడ్నీ ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. 
 
దీంతో కుమార్తె రోహిణి కిడ్నీదానం చేయడంతో ఈ ఆపరేషన్‌ను సింగపూర్‌లో పూర్తిచేశారు. ప్రస్తుతం లాలూతో పాటు రోహిణి కూడా ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు తెజస్వీ వెల్లడించారు. కిడ్నీ మార్పిడి చికిత్స తర్వాత తన తండ్రిని ఆపరేషన్ థియేటచర్ నుంచి ఐసీయూకి మార్చినట్టు బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ వెల్లడించారు. 
 
కాగా, లాలూ కుమార్తె రోహిణి సింగపూర్‌కు చెందిన ఓ ఐటీ నిపుణిని పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడ్డారు. తండ్రి కోసం తన కిడ్నీ ఇచ్చి ఆయనపై తన ప్రేమను చాటుకున్నారు. తన తండ్రి ఎందరికో ఆదర్శప్రాయుడని, ఆయనకోసం తాను చేస్తున్నది చాలా చిన్న త్యాగమని ఇటీవల రోహిణి పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు