ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన "జియో డిజిటల్ లైఫ్" ప్రకటనల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కనిపించడం ప్రస్తుతం వివాదాస్పదమైంది. ఓ వార్తా పత్రికకు ఇచ్చిన ఫుల్ పేజ్ పత్రికా ప్రకటనల్లో ప్రధాని నరేంద్ర మోడీ కనిపించడం విమర్శలకు దారితీసింది. దీనిపై ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సెటైర్లు వేశారు. ప్రధాని మోడీని ''మిస్టర్ రిలయన్స్" అంటూ కేజ్రీవాల్ కామెంట్ చేశారు.