'భస్మ ఆరతి' (భస్మముతో అర్పించడం) ఈ ఆలయంలో ప్రసిద్ధ ఆచారం. ఇది ఉదయం 3:30 మరియు 5:30 గంటల సమయంలో 'బ్రహ్మ ముహూర్తం' సమయంలో జరుగుతుంది. ఆలయ పూజారి గౌరవ్ శర్మ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భస్మ హారతికి ముందు, మహాకాళేశ్వరునికి నీటితో పవిత్ర స్నానం, పంచామృత మహాభిషేకం నిర్వహించడం జరిగిందన్నారు. అభిషేక ఆరాధనల పిమ్మట డప్పుల మోత, శంఖు ధ్వనుల మధ్య భస్మ హారతి నిర్వహించారు.
'శ్రావణం' అని కూడా పిలువబడే సావన్ అనేది హిందూ చాంద్రమాన క్యాలెండర్‌లో ఐదవ నెల. ఇది అత్యంత పవిత్రమైన మాసాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ కాలంలో ప్రతి సోమవారం ఉపవాసం చేపట్టడం ఆచారం. అలాగే శ్రావణ మాసం శివునికి ఇష్టమైన మాసంగా పరిగణించబడుతుంది. ఈ కాలంలో శివుడిని పూజించడం ద్వారా భక్తుల కష్టాల నుండి తక్షణ ఉపశమనం పొందుతారని విశ్వాసం.
ఈ సంవత్సరం శ్రావణ మాసం జూలై 4 నుండి ఆగస్టు 31 వరకు 59 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ శ్రావణ మాసంలో ప్రజల స్థితిగతులను తెలుసుకోవడానికి, మహాకాలేశ్వరుడు నగర పర్యటనకు వెళతారని నమ్ముతారు. ఇలా ఈశ్వరుడు నగర పర్యటనకు వచ్చే దృశ్యాలను వీక్షించేందుకు భక్తులు రోడ్డు పక్కన గంటల తరబడి వేచి ఉన్నారు.