ట్రిపుల్ తలాక్ బిల్లు రూపకర్తల్లో ఒకరైన నారాయణ రాజు మృతి..

గురువారం, 6 మే 2021 (09:32 IST)
జమ్మూకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్, సీఏఏ బిల్లుల రూపకల్పనలో కీలకంగా వ్యవహరించిన కేంద్ర న్యాయశాఖ (శాసన) కార్యదర్శి డాక్టర్ జి.నారాయణరాజు మృతి చెందారు. ఆయనకు కరోనా సోకడంతో కన్నుమూశారు. ఆయన వయసు 62 సంవత్సరాలు. కొవిడ్ బారినపడి ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నారాయణరాజు పరిస్థితి విషమించడంతో మృతి చెందారు.
 
నెల్లూరు జిల్లాకు చెందిన ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో చదువుకుని, తొలినాళ్లలో అక్కడే అధ్యాపకుడిగా పనిచేశారు. 2015లో న్యాయశాఖలో చేరిన నారాయణరాజు శాసన వ్యవహారాల కార్యదర్శిగా, జమ్మూకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్, సీఏఏ బిల్లుల రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు.
 
నారాయణరాజు రెండేళ్ల క్రితం రిటైరయ్యారు. అప్పటికి ఆయన కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్‌ సభ్యుడిగా పనిచేస్తున్నారు. రిటైర్ అయినప్పటికీ ఆయన సమర్థతను గుర్తించిన కేంద్రం మరో రెండేళ్లపాటు నారాయణరాజు పదవీకాలాన్ని పొడిగించింది. ఆయన మృతికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలువురు సంతాపం తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు