బెంగుళూరులో చిరుత బీభత్సం.. పాఠశాలలోకి దూసుకొచ్చింది...

సోమవారం, 8 ఫిబ్రవరి 2016 (09:34 IST)
బెంగళూరు నగరంలో ఓ చిరుత బీభత్సం సృష్టించింది. అందగు కుందనహళ్లిలోని విబ్జియార్‌ స్కూల్ లోకి దూసుకువచ్చిన చిరుత ఆరుగురిని గాయపరిచింది. చిరుతను బంధించేందుకు వచ్చిన నలుగురిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. చిరుతతో జరుగిన దాడిలో కన్జర్వేటర్ సంజయ్ గుబ్బి కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి దాంతో అక్కడి ప్రజలు జనం భయాందోళనలతో  పరుగులు తీశారు. ఆదివారం సెలవు దినం కావడంతో పెనుప్రమాదం తప్పింది.
 
స్కూల్లో తిరుగుతున్న చిరుతపులిని సీసీ టీవీ కెమెరాలు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో బంధించాయి. ఇంతలో సరిహద్దు గోడ దాటి స్కూల్‌లోకి చిరుత ప్రవేశించింది. ఉదయం స్కూలుకొచ్చిన సిబ్బంది సీసీ టీవీ ఫుటేజీలను చూసి భయభ్రాంతులకు గురయ్యారు. చిరుతపులి ఇంకా అక్కడే ఉన్నట్టు తెలుసుకుని వెంటనే పోలీసులకు, అటవీ అధికారులకు సమాచారం అందించారు. మొత్తం మీద అటవీ అధికారులు చిరుతను బంధించారు. దీంతో స్కూలు యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. 

వెబ్దునియా పై చదవండి