బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో భాజపా అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ వాంగ్మూలాన్ని లఖ్‌నవూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు నమోదు చేసింది. మసీదు కూల్చివేత కేసులో 49 మంది నిందితుల పేర్లను సీబీఐ నమోదు చేయగా, వారిలో 32 మంది సజీవంగా ఉన్నారు. వారందరి నుంచి సీఆర్‌పీసీలోని 313 సెక్షన్ కింద వాంగ్మూలాల నమోదు ప్రక్రియ జరుగుతోంది.