విజయవాడ: ఇది లాంగ్ డే. అంటే... పగటి పూటి సూర్యుడు ఎక్కువ సమయం ఉండే రోజిది. సాయన పద్ధతి ప్రకారం సూర్యుడు ఉత్తరాయణంలో ఉచ్ఛదశకు చేరుకుంది. అంటే సంవత్సరం మొత్తంమీద పగలు ఎక్కువగా ఉండే రోజు ఇది. లాత్వియన్లు ఈ రోజును జానిగా పేర్కొంటూ పండుగ చేసుకుంటారు. యూరోపియన్లు ఈ రోజును మిడ్ సమ్మర్, సెయింట్ జాన్స్ డే గా వ్యవహరిస్తారు.
ఇలా జీవకోటికి అన్నదాత అయిన సూర్యుడు ఎక్కువసేపు ఉండే రోజు కాబట్టి ఈ రోజును అనేక జాతులవారు, తెగలవారు పండుగలా జరుపుకోవడం ఆనవాయితీ. ఇంతటి ప్రత్యేకత సంతరించుకున్న ఈరోజే... జూన్ 21 యోగా డే కూడా అవ్వడం విశేషం.