ఈ బస్సును కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్), కేపీఐటీ లిమిటెడ్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ బస్సులోని ఫ్యూయల్ సెల్ హైడ్రోజన్‌ను, గాలిని క్రమపద్ధతిలో వినియోగించుకోవడం ద్వారా విద్యుశ్చక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఆ శక్తిని బస్సుకు అందిస్తుంది. ఈ ప్రక్రియలో ఎక్కడా కాలుష్యానికి తావు ఉండదు.