'కోర్టు తీర్పు నేపథ్యంలో ప్రహ్లాద్ లోథి సభ్యత్వం రద్దయింది. అసెంబ్లీలో ఓ స్థానం ఖాళీ అయింది. ఈ విషయాన్ని ఎన్నిక కమిషన్ దృష్టికి కూడా తీసుకువెళ్లాం' అని తెలిపారు. కాగా, లోథీ సభ్యత్వం రద్దుపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాకేష్‌సింగ్ మండిపడ్డారు.
అసెంబ్లీ సభ్యత్వాన్ని స్పీకర్ రద్దుచేయడం రాజ్యాంగ వ్యతిరేకమని, సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని తప్పుబట్టారు. స్పీకర్ పూర్తిగా కాంగ్రెస్ మనిషిలా వ్యవహరించి ఆ పార్టీ ప్రతీకార చర్యకు సాయపడ్డారని విమర్శించారు. ఈ తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు ప్రకటించారు.