పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేసినా భరణం చెల్లించాల్సిందే : హైకోర్టు కీలక తీర్పు

వరుణ్

సోమవారం, 8 ఏప్రియల్ 2024 (06:11 IST)
పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్న మహిళకు భరణం చెల్లించాల్సిందేనంటూ మధ్యప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు కీలక రూలింగ్ ఇచ్చింది. తన నుంచి విడిపోయిన భాగస్వామికి ప్రతి నెల రూ.1500 చెల్లించాలని కింది కోర్టు ఆదేశించింది. దీన్ని పిటిషనర్ హైకోర్టులో సవాల్ చేయగా, కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. పైగా, సహజీవనానికి ఆధారాలు లేవన్న కారణంతో భరణాన్ని నిరాకరించలేమని, పైగా, లివింగి రిలేషన్‌షిప్ ముగిసినా మహిళను ఉత్త చేతులతో వదిలివేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. 
 
ఒక మహిళను చట్టబద్ధంగా పెళ్లి చేసుకోకున్నా కొంతకాలం పాటు కలిసి జీవించినందుకు భరణానికి ఆమె అర్హురాలేనని స్పష్టం చేసింది. ఓ కేసు విచారణలో కొట్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తనతో సహజీవనం చేసిన మహిళకు ప్రతినెల రూ.1500 చెల్లించాలంటూ కిందికోర్టు ఇచ్చిన తీర్పును పిటిషనర్ హైకోర్టులో అప్పీల్ చేయగా, పైవిధంగా హైకోర్టు తీర్పునిచ్చింది. సహజీవనానికి ఆధారాలు లేకపోయినప్పటికీ భరణం చెల్లించాల్సిందేనని తీర్పును వెలువరించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు