ఐతే ఈ రెండు పెళ్ళిళ్లకు వెళ్ళిన కామన్ బంధువు ఒకరు దీనిని గమనించి విషయం బయటపెట్టడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. దీనితో ఖండ్వా మహిళ కుటుంబం పోలీసులకి ఫిర్యాదు చేయడంతో అతనిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.