ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. పెళ్లి చేసుకుంటాననే హామీతో కొంతకాలం శారీరకంగా కలవడాన్ని అత్యాచారంగా పరిగణించలేమని ఢిల్లీ సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. పెళ్లికి ముందు యువతి, యువకుడు, లేక ఆడా, మగవారు చాలా కాలం నుంచి ప్రేమలో ఉన్న సమయంలో జరిగే శారీరక కలయిక ప్రతి సందర్భంలోనూ అత్యాచారం కిందకి పరిగణనలోకి రాదని ఢిల్లీ హైకోర్టు తీర్పిచ్చింది. ఎక్కువ కాలం ప్రేమలో ఉన్నప్పుడు ఏర్పడే శారీరక సంబంధాలు అత్యాచారం జరిగిందని సమర్థించలేమని జస్టిస్ విభు భక్రు పేర్కొన్నారు.
కాగా, కొన్నేళ్ల కిందట 2008లో ఓ వ్యక్తితో యువతికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. కొంతకాలం వాళ్లిద్దరూ కలిసి ఉన్నారు. ఆపై పెళ్లి పేరుతో నమ్మించి తనపై అత్యాచారం చేశాడని కోర్టును ఆశ్రయించింది. సుదీర్ఘకాలం కొనసాగిన సంబంధాలను అత్యాచారం కిందకి రాదని, అత్యాచారం జరిగిందని భావించలేమని ధర్మాసనం అభిప్రాయపడింది.