మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలోని వాసాయిలో ట్రాన్స్ జెండర్స్‌కి ఉచిత విద్యను అందించేందుకు పాఠశాలను ఏర్పాటు చేశారు. ట్రాన్స్ జెండర్స్ సమాజంలో అక్షరాస్యత చాలా తక్కువగా ఉంది. వారు ఎక్కడికైనా వెళ్లి చదువుకోవాలి అంటే అనేక రకాల ఇబ్బందులు. వీటిని దృష్టిలో ఉంచుకొని ఓ ఎన్జీవో ముందుకు వచ్చి వీరి కోసం పాఠశాలను నిర్మించింది. ఇక ఇప్పటి వరకు ఈ పాఠశాలలో పెద్దలు, పిల్లలు కలిసి 25 మంది జాయిన్ అయినట్లు పాఠశాల నిర్వాహకులు తెలిపారు.